సారంగాపూర్ మండలం వైకుంఠపూర్ గ్రామంలో మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శివాజీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. వీరత్వానికి ప్రతీకగా కొలుచుకునే వీరుడు ఛత్రపతి శివాజీని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. గ్రామంలో యువకులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల బీజేపీ నాయకులు, గ్రామ యువకులు, పాల్గొన్నారు.