కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం పోచంపల్లి మోడల్ స్కూల్ వద్ద పెను ప్రమాదం తప్పింది. వివరాలలోకి వెళితే గురువారం సాయంత్రం స్కూలు ముగించుకొని పోచంపల్లి స్టేజి వద్ద విద్యార్థులు బస్సు కోసం ఎదురుచూస్తున్నారు. సాయంత్రం బస్సు రావడంతో విద్యార్థులందరూ బస్సు ఎక్కుతున్నారు. మెల్లిమెల్లిగా కదులుతున్న ఆర్టీసీ బస్సు ఎక్కబోయి ఓ విద్యార్థి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. పోచంపల్లి మోడల్ స్కూల్లో చదువుతున్న చెంజర్ల గ్రామానికి చెందిన అభిషేక్ ఈ ఘటనలో టైర్ కింద పడ్డాడు. అతని కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మరిన్ని వ