జిల్లాలో రహదారులపై ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. మంగళవారం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్. పి. కాంతిలాల్ సుభాష్ తో కలిసి రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, జిల్లా రవాణా శాఖ, జాతీయ రహదారుల సంస్థ, విద్యుత్, ఆర్. టి. సి., మున్సిపాలిటీ, వైద్య ఆరోగ్య శాఖల అధికారులతో రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణకు చేపట్టవలసిన చర్యలపై రోడ్డు భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రహదారులపై ప్రమాదాలు జరగకుండా అవసరమైన రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించా