జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో పెద్ద చెరువును మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం మధ్యాహ్నం సందర్శించి వినాయక నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు భారీగా వస్తారని ఎలాంటి అసౌకర్యం తలెత్తకుండా తగిన భద్రత ఏర్పాట్లు శానిటేషన్ ట్రాఫిక్ నియంత్రణ లైటింగ్ తాగునీటివంటి అన్ని అవసరమైన వాటిని ఏర్పాటు చేయాలని తెలిపారు. త్వరలోనే చెరువుకు సంబంధించి సుందరీకరణ పనులు కూడా త్వరితగతిన ప్రారంభించాలని ఆదేశించారు.