కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల కాలువటాల మార్గమధ్యంలో ఉన్న కొలిమిగుండ్ల మైన్స్ రోడ్డులో ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో ఒరిస్సాకు చెందిన ప్రదీప్ నాయక్ అనే కార్మికుడికి గాయాలయ్యాయి. కార్మికుడు స్థానిక రామ్ కో సిమెంట్ ఫ్యాక్టరీలో ప్లంబర్గా పనిచేస్తున్నాడు. ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడిన ఘటన తీవ్రంగా గాయపడగా అతనిని అనంతపురం ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.