మహబూబాబాద్ జిల్లా,బయ్యారం మండలంలోని కొత్తపేట-గందంపల్లి గ్రామాల మధ్య ఉన్న చెరువుపై,మినీ ట్యాంక్ బండ్ నిర్మాణ పనులను ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య లాంచనంగా ప్రారంభించారు.ప్రతి పల్లెలో ప్రగతి, ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందించే లక్ష్యంతో నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ,నిర్విరామంగా శ్రమిస్తానని ఎమ్మెల్యే ప్రకటించారు, ఈనెల కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి భూక్య ప్రవీణ్ నాయక్, స్థానిక నేతలు అధికారులు పాల్గొన్నారు .