శ్రీ సత్య సాయి జిల్లా ఓబులదేవరచెరువులో ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం మధ్యాహ్నం ఓబులదేవరచెరువులో జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా భారీ కేక్ కట్ చేసి పంచిపెట్టారు. నియోజకవర్గ జనసేన నాయకులు కొండబోయిన సతీష్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్క జన సైనికుడు అంకితభావంతో పనిచేస్తామన్నారు. పేద ప్రజలు బాగుండాలని నిరంతరం పరితపించే జనసేనాని ఆయురారోగ్యాలతో ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.