కోరుట్లలో వీధి కుక్కల స్వైరవిహారం: ప్రజల ఆందోళన కోరుట్ల పట్టణంలో వీధి కుక్కలు రాత్రివేళల్లోనే కాకుండా, ఉదయం పూట కూడా గుంపులుగా రోడ్లపై తిరుగుతున్నాయి. దీనివల్ల స్కూల్కు వెళ్లే పిల్లలు, పనికి వెళ్లే ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు. వృద్ధులు, మహిళలు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. బహిరంగంగా చెత్త వేయడం తగ్గితే ఈ సమస్య తగ్గుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.