పకడ్బందీ ప్రణాళిక ప్రకారం యూరియా పంపిణీ చేపట్టాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. ఆదివారం రాత్రి 7 గంటల సమయం లో అనంతపురం నగరంలోని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి యూరియా పంపిణీపై జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి, మార్క్ ఫెడ్ డిఎం, ఏపీఎమ్ఐపి పిడి, ఆర్డీఓలు, తహసీల్దార్లు, ప్రైమరీ సెక్టార్ అధికారులు, మండల వ్యవసాయ అధికారులు, విలేజ్ అగ్రికల్చర్, హార్టికల్చర్ అసిస్టెంట్లు, తదితరులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో యూరియా పంపిణీ ప్రణాళిక రూపొందించాలనారు.