వ్యర్ధాలతో పాడవుతున్న తోపు కుంట మినీ ట్యాంక్ బండ్. ములుగు జిల్లా కేంద్రం లోని తోపు కుంట వద్ద నిత్యం ప్రజలు సేద తీరడానికి వస్తుంటారు. అదే విధంగా వినాయక నిమజ్జనం మరియు ప్రత్యేక బతుకమ్మ వేడుకలను ఇక్కడే వేలాది మహిళలతో నిర్వహిస్తుంటారు. అలాంటి ప్రదేశంలో సాయంత్రం అయితే చాలు మందు బాబులకు అడ్డా గా మారుతుంది. అదే విధంగా వ్యర్థాలు పడేసే ఆవాసంగా మారుతుంది. దీంతో ఆ ప్రాంతంలో దుర్గంధం వెదజల్లుతుందని ప్రజలు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిత్యం పరిశుద్య పనులు చేపట్టాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నేడు మంగళవారం రోజున సాయంత్రం 5 గంటలకు డిమాండ్ చేస్తున్నారు.