ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు శిథిలావస్థకు చేరిన కలెక్టరేట్ భవనం లోని భాగం పైకప్పు కూలిన సంగతి తెలిసిందే. దింతో కూలిన భవనాన్ని హైదరాబాద్ నుండి వచ్చిన ఎక్స్పర్ట్ కమిటీ అధికారుల బృందం సభ్యులు శుక్రవారం పరిశీలించారు. అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, కలెక్టరేట్ ఏవో వర్ణ తో కలిసి బృందం సభ్యులు కూలిన ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, భవన ప్రస్తుత పరిస్థితిని పై అంచనా వేశారు. కలెక్టరేట్లోని ఏ సెక్షన్ మొదటి అంతస్థూ పై కప్పు కూలడంతో ఆ ప్రాంతాన్ని భవనం పైకెక్కి పూర్తిస్థాయిలో పరిశీలించారు.