ఆసిఫాబాద్ పట్టణం అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం మోపి కేసులు నమోదు చేశామని ASF సీఐ బాలాజీ వరప్రసాద్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ASF లోని పలు వాగుల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని సమాచారంతో దాడులు నిర్వహించామన్నారు. ప్రభుత్వానికి రుసుము చెల్లించి ఇసుక తీసుకెళ్లాలని అన్నారు. అనుమతులు లేకపోతే ట్రాక్టర్లను సీజ్ చేసి వారిపై కేసులు పెడతామని హెచ్చరించారు.