ముమ్మిడివరం మండలం, కొమానపల్లి లో ప్రధానమంత్రి మోడీ, సీఎం నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తో కలిసి ధాన్యంతో అభిషేకం చేశారు. అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ మొదటి విడత సాయం విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ వైకాపా పాలనలో రైతుల జపం చేసారు తప్ప రైతు గోడు వినలేదని, ఎన్నికల్లో రైతులుకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం పని చేస్తుందన్నారు.