శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని మర్రికుంట లో గల తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు సులువుగా అర్థమయ్యే విధంగా విషయపరిజ్ఞానంపై పట్టు వచ్చేలా ఫిజిక్స్ కెమిస్ట్రీ పై బోధనలు చేసేటప్పుడు అర్థవంతంగా సులభతర పద్ధతుల్లో నేర్పించాలని ఆదేశాలు ఇచ్చారు. విద్యార్థులకు నాణ్యవంతమైన విద్యను అందించి ఉన్నత శిఖరాలను అధిరోహించేలా కృషి చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కళాశాల ఉపాధ్యాయులు అధ్యాపకులు విద్యార్థులు తదితరులు ఉన్నారు.