ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు వెంకటాపురం గ్రామంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె కరపత్రాలు ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ప్రజలకు చేసిందేమీ లేదని ప్రశ్నించిన వైసీపీ నాయకులపై కేసులు పెట్టే పనిలోనే ఉన్నారని విమర్శించారు.