ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల గ్రామ సమీపంలో శనివారం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డ సంఘటన చోటుచేసుకుంది. గాయపడ్డ వ్యక్తిని స్థానికులు 108 అంబులెన్స్ ను పిలిపించి ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. జరిగిన ప్రమాదంపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గాయపడ్డ క్షతగాత్రుడిని వెంటనే ఆసుపత్రికి తరలించిన స్థానికులను పోలీసులు అభినందించారు.