సికింద్రాబాద్ జేబీఎస్ సమీపంలో కూల్చివేతలు చేపట్టిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న ఎంపీ ఈటల రాజేందర్ బుధవారం మధ్యాహ్నం ఘటన స్థలాన్ని సందర్శించి బాధితులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. కూల్చివేతలు ఎలా చేపడుతారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. బాధితులకు అండగా ఉంటామని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పాల్గొన్నారు.