రామాయంపేట పట్టణంలోని అన్నదాత ఎరువుల కేంద్రం వద్ద మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వం సొసైటీలకు యూరియా సరఫరా చేయకుండా ప్రైవేట్ వ్యాపారస్తులకు యూరియా సరఫరా చేసి కొరత సృష్టిస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదాత ఆగ్రో సేవా కేంద్రంలో గంట మందు కొనుగోలు చేసిన వారికి మాత్రమే యూరియా అమ్మకాలు చేయడంపై రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల కష్టాలు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు ఒక మాట, ముఖ్యమంత్రి మరొక మాట మాట్లాడుతూ రైతులు గోసలు పడుతున్న పట్టించుకోవడంలేదన్నారు.