శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లి జగనన్న కాలనీలో శుక్రవారం ఉదయం మినరల్ వాటర్ ట్యాంకర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. స్థానికులు మాట్లాడుతూ రోడ్డు సరిగా లేక పలుమార్లు ద్విచక్ర వాహనాలు ప్రమాదానికి గురయ్యాయని స్థానికులు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు రోడ్డు ఏర్పాటు చేయాలని వారు కోరారు.