Araku Valley, Alluri Sitharama Raju | Sep 26, 2025
డుంబ్రిగుడ మండలంలోని అరకు శుక్రవారం వారపు సంతలో మేకలు, నాటుకోళ్లకు ఫుల్ గిరాకీ పెరిగింది. ఒక మేక రూ.15వేలు నుంచి రూ.20 వేలు వరకు ధర పలుకుతుండగా, కేజీ నాటుకోడిని రూ.1500 నుంచి రూ.2000 వేలు వరకు విక్రయిస్తున్నారు. వాటిని కొనేందుకు ఆంధ్ర - ఒడిశా సరిహద్దుల గ్రామాల వారు బారులు తీరుతున్నారు. నాటు కోళ్లకు మేకలకు గిరాకీ పెరగడంతో పెంపకం దారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు