రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని పలు ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలలో వసంత పంచమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు సరస్వతి అలంకరణలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. శాన్వికప్రియా అనే ఓ చిన్నారి సరస్వతి మాత అలంకరణలో అందరిని ఆకట్టుకుంది. వసంత పంచమి వేడుకల సందర్భంగా పలు పాఠశాలలో చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు..