కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బహుదూర్ పల్లిలోని టెక్ మహీంద్రా యూనివర్సిటీలో తెలంగాణ యాంటీ నార్కోటి అధికారులు తనిఖీలు నిర్వహించారు. కొంతమంది విద్యార్థులు గంజాయి, డ్రగ్స్ కు బానిసలు అవుతున్నారని సమాచారం మేరకు ఈ దాడులు జరిపారు. మొత్తం 14 మంది విద్యార్థులను పరీక్షించగా, వారిలో ఐదుగురికి డ్రగ్స్ వాడకం పాజిటివ్గా నిర్ధారణ అయింది. తెలంగాణ ఆంటీ నార్కోటిక్ డిసిపి సైదులు ఈ తనిఖీలకు నాయకత్వం వహించారు.