తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించడంతో, మహిళలకు గతంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆధార్ కార్డు చెల్లడం లేదు. దీంతో రామాయంపేట మండల కేంద్రంలోని ఆధార్ కేంద్రాల వద్ద ఉదయం 6 గంటల నుంచి ఆధార్ కరెక్షన్ కోసం లైన్ లో నిలబడి వేచి చూస్తున్నారు. రోజుకు 30 మందికి మాత్రమే ఆధార్ కరెక్షన్ కావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సందర్బంగా మహిళలు మాట్లాడుతు ఆర్టీసీ బస్సుల్లో ఆంధ్రప్రదేశ్ అడ్రస్ ఉన్న ఆధార్ కార్డు చెల్లుబాటు కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆధార్ లో అడ్రస్ మార్పు కోసం గత 4 రోజులుగా తిరుగుతున్నమన్నారు