ఏలూరు జిల్లా దెందులూరు మండలం కొవ్వలి శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో 108 బిందుల జలాలతో గ్రామానికి చెందిన మహిళలు జలాభిషేకాన్ని ఆదివారం సాయంత్రం నిర్వహించారు. సోమవారం నుంచి జరిగే దేవి శరన్నవరాత్రులను పురస్కరించుకొని భక్తులు అమ్మవారికి అభిషేకాలు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పలురకాలైన ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకాలు చేశారు. ఈ సందర్బంగా అమ్మవారిని వెండి వస్తువులతో అలంకరణ చేశారు. గ్రామానికి చెందిన దాతలు అమ్మవారికి 4 గ్రాములతో బంగారు ముక్కపుడక, ముక్కునత్తు మరియు అడ్డబాస సమర్పించినారు. కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలు పాల్గొని తిలకించారు.