కుందుర్పి మండల కేంద్రంలో ఇటీవల కాలంలో ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతున్నది. బస్సులు ఇతర వాహనాలు బ్యాంకు వద్ద ఆపుతున్నారు. దీంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతున్నది. ఇక పండగల రోజుల్లో ట్రాఫిక్ మరింత అధికమవుతున్నది. రోడ్డు చిన్నదిగా ఉండడంతో పైగా చిరు వ్యాపారులు రోడ్డుపైనే విక్రయాలు ట్రాఫిక్కు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. పోలీసులు, పంచాయతీ అధికారులు స్పందించి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.