భారీ వర్షాల మూలంగా దెబ్బతిన్న వరి పంటను శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకి నిజామాబాద్ జిల్లా డిసిసిబి మాజీ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి పరిశీలించారు.చందురు ,శంకోరా , రాజిపేట్ శివార్లలో వరద ప్రవాహానికి దెబ్బతిన్న వరి పంటను స్థానిక రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. దెబ్బతిన్న పంటల, కూలిపోయిన ఇండ్ల వివరాలను సేకరించి ప్రభుత్వానికి వెంటనే నివేదిక పంపే విధంగా చర్యలు చేపట్టాలని నష్టపోయిన బాధితులకు వెంటనే పరిహారం ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.