సంగారెడ్డి మున్సిపాలిటీ 34 పరిధిలోని రామచంద్ర రెడ్డి నగర్లో పార్కు స్థలం కాపాడాలని కోరుతూ స్థానికులు కలెక్టర్ కార్యాలయం ముందు సోమవారం నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్ ప్రావీణ్యకు వినతిపత్రం సమర్పించారు. కొందరు వ్యక్తులు పార్కు స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని స్థానికులు ఆరోపించారు.