కాణిపాకం శ్రీ స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం యాగశాలలో పూర్ణాహుతి, వసంతోత్సవం, పుష్కరిలో త్రిశూల స్నానం వంటి కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో పెంచల కిషోర్, ఏఈఓలు రవీంద్రబాబు, ఎస్.వి.కృష్ణారెడ్డి, పర్యవేక్షకుడు కోదండపాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు, స్థానిక సర్పంచ్ శాంతి సాగర్ రెడ్డి, కాణిపాకం ఎస్‌ఐ నరసింహులు, ఆలయ అధికారులు, సిబ్బంది, అర్చకులు, వేద పండితులు, ఉభయదారులు తదితరులు పాల్గొన్నారు.