సనాతన ధర్మం గురించి మాట్లాడే రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లాలోని తకెళ్ళపాడు శ్రీకృష్ణుడు రూపంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తే ఎందుకు స్పందించలేదని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు కుమ్మర క్రాంతి కుమార్ ప్రశ్నించారు. శ్రీకృష్ణుడు రూపంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని మార్పు చేయాలని యాదవ సంఘాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో స్థానిక టిడిపి నాయకులు వెనక్కి తగ్గడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సోమవారం మధ్యాహ్నం గుంటూరు నగరంలోని బి. పి మండల్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో క్రాంతి కుమార్ మాట్లాడారు.