ఆదోని పట్టణంలో బుధవారం రేణుకాంబ హోటల్ నుంచి మాధవరం వరకూ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఉదయం బడులు, కళాశాలలకు వెళ్లే పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అధికారులు, ప్రజాప్రతినిధులు బైపాస్ పనులు పూర్తి చేసి భారీ వాహనాలను ఊరు బయట నుంచి పంపాలని స్థానికులు కోరుతున్నారు.