జిల్లాలో ఎన్నికల ఏర్పాట్ల పరిశీలనకు శుక్రవారం జిల్లాకు విచ్చేసిన సీఈఓ ఏలూరు కలెక్టరేట్ లో జిల్లాలో ఓటుహక్కుపై ఓటర్ల అవగాహన కోసం నిర్వహించిన కార్యక్రమాలపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఓటర్లను చైతన్య పరిచేందుకు 'స్వీప్ ' కార్యక్రమాలను మరింత ముమ్మరం చేయాలనీ ఆయన సూచించారు. జిల్లాలో నిర్వహిస్తున్న స్వీప్ కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ వివరిస్తూ జిల్లాలో పోలింగ్ శాతం పెంచే విధంగా, ఏథికల్ ఓటింగ్ జరపాలని 40 రోజులుగా 1756 కార్యక్రమాలు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు చేపట్టడం జరిగిందని తెలిపారు