తురకపాలెం గ్రామంలో సంభవిస్తున్న వరుస మరణాలకు కారణం తాగునీరు అనడం కరెక్ట్ కాదని, అరుదైన వ్యాధి పట్ల ఎవరికి సరైన అవగాహన లేదని, తెలుసుకునేందుకు కొంత సమయం పడుతుందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం సాయంత్రం గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో గ్రామంలో పెమ్మసాని చంద్రశేఖర్ పర్యటించారు. అనంతరం మీడియాతో పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ ఇది కామన్ డిసీజ్ కాదని, తాను డాక్టర్ గా ప్రాక్టీస్ చేసిన సమయంలో కూడా ఇలాంటి డిసీజ్ చూడలేదన్నారు. గ్రామంలో నిర్వహిస్తున్న పరీక్షలు పూర్తయిన తర్వాత మాత్రమే వ్యాధికి సంబంధించి వాస్తవాలు తెలుస్తాయని తెలిపారు.