ప్రకాశం జిల్లా మరిపూడి మండలం రేగలగడ్డ గ్రామంలో శనివారం దారుణం చోటుచేసుకుంది. నరసింహ అనే వ్యక్తి అనుమానంతో తన భార్యను రోకలిబండతో దాడి చేసి చంపడంతో పాటు తన గొంతు కోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. విషమంగా ఉన్న నరసింహను పోలీసులు ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే సంఘటన స్థలాన్ని పరిశీలించిన సీఐ సోమశేఖర్ జరిగిన ఘటనపై పలు అనుమానాలు ఉండడంతో వెంటనే డాగ్ స్క్వాడ్ ను రంగంలోకి దించారు. డాగ్ అక్కడక్కడే తిరగడంతో ఎటువంటి ఆధారాలు లభించలేదని సీఐ తెలిపారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని సిఐ అన్నారు.