కోల్ బెల్ట్ లో వినాయక చవితి సందడి వినాయక చవితి సందర్భంగా బుధవారం మండపాలకు వినాయక విగ్రహాలను తరలించారు. ఇక్కడి మండపాలకు ఉదయం నుండి మొదలైన వినాయక విగ్రహాల తరలింపు మధ్యాహ్నం వరకు కొనసాగింది. ఇదిలా ఉండగా వర్షం కారణంగా వినాయక విగ్రహాలు కొనుగోలు చేసేందుకు భక్తులు ఇబ్బందిపడ్డారు. వినాయక విగ్రహాలు ఆయా కాలనీల్లో మండపాలలో నెలకొల్పడానికి వివిధ రకాల సైజులలో విగ్రహాలను విక్రయించారు. ఇదే అదనుగా విగ్రహాలు అమ్మకాలు చేస్తున్న వ్యాపారులు వేలాది రూపాయలు చెప్పుతూ అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆవేదన చెందారు. ఏది ఏమైనా వినాయక చవితి సందర్భంగా కోల్ బెల్ట్ పారిశ్రామిక ప్రాంతంలో చిన్న పెద్దలతో సం