ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని సఖీ సెంటర్లో పని చేస్తున్న తన భార్య మమతను కలెక్టర్ వద్ద పని చేస్తున్న సీసీ రమణ కిడ్నాప్ చేశాడని ఆమె భర్త రమేశ్ శనివారం ఆరోపించారు. మమతతో 15 ఏళ్ల క్రితం పెళ్లైందని, ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిపారు. 5 రోజుల నుంచి కనిపించకుండా పోయిందని పేర్కొన్నారు. రెబ్బెన పోలీస్ స్టేషన్లో సీసీపై ఫిర్యాదు చేసిన ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె లేకపోతే మాకు చావే శరణం అన్నారు.