బొల్లాపల్లి మండలంలో ఓ మహిళ దారుణ హత్య కు గురైంది. మేళ్లవాగుకు చెందిన కృష్ణ కుమారి పొలంలో దారుణంగా హత్యకు గురైనట్లు సోమవారం రాత్రి స్థానికులు తెలిపారు. ఆమె ముఖంపై పదునైన ఆయుధంతో నరికి చంపినట్లు ఆనవాళ్లు ఉన్నాయని తెలుస్తోంది. సమాచారం అందుకున్న బండ్లమోట్టు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, విచారణ చేపట్టారు.