రామకుప్ప మండలంలోని ననియాల గ్రామంలో తండ్రిని కుమారుడు హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి నిందితుడిని అరెస్టు చేసినట్లు కుప్పం రూరల్ సీఐ మల్లేష్ యాదవ్ తెలిపారు. ననియాల గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం మద్యం సేవిస్తూ, ఇంటికి వచ్చి వేధిస్తుండడంతో అతని కుమారుడు షణ్ముగం తాడుతో హతమార్చాడని విచారణలో తేలిందన్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందన్నారు.