గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని పట్టణంలోని ఆర్యవైశ్య భవనంలో ఏర్పాటు చేసిన గణపతి మండపం వద్ద స్వామివారిని దర్శించుకుని వెళ్లే భక్తులకు ప్రతిరోజు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశామని భక్తులు ఎవరైనా రావొచ్చు అంటూ మండప నిర్వహకులు పేర్కొన్నారు తొమ్మిది రోజులపాటు స్వామివారిని 9 అలంకరణలతో పూజిస్తామని స్వామివారికి ప్రతి సంవత్సరం కరెన్సీ నోట్లతో పూజించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుందని గణపతి మండప నిర్వహకులు తెలిపారు