అనంతపురం నగరంలోని ఎన్టీఆర్ విగ్రహం ఎదుట నగరానికి చెందిన ఆటో డ్రైవర్లు సంబరాలు జరుపుకున్నారు. దసరా నుంచి ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర ద్వారా 15000 అందిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.