సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఆదేశాలతోనే జైలు అధికారులు పనిచేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. విజయవాడ సబ్ జైలు వద్ద రిటైర్డ్ అధికారులు ధనుంజయరెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి విడుదల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కోర్టులను కూడా మేనేజ్ చేసే స్థితికి చంద్రబాబు దిగజారారని విమర్శించారు. చంద్రబాబు, లోకేశ్ కోర్టు ఆదేశాలను కూడా లెక్క చేయటం లేదన్నారు. వంశీని కూడా ఇలానే ఇబ్బంది పెట్టారన్నారు.