మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని నియోజకవర్గ కేంద్రమైన జగ్గంపేటలో వైసిపి నాయకులు మంగళవారం ఎంతో ఘనంగా నిర్వహించారు. అయితే ఒక ప్రక్క మాజీ మంత్రి, వైసిపి ఇన్చార్జ్ తోట నరసింహం వర్గం ఒకవైపు, మరోవైపు మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు వర్గం ఇలా ఇరు వర్గాల్లో కూడా స్థానిక వైసిపి పార్టీ కార్యాలయం నుంచి బైకులు పై జోహార్ వైయస్సార్ అంటూ నినాదాలు చేసుకుంటూ భారీ ర్యాలీ నిర్వహించి జగ్గంపేట సెంటర్లో ఉన్న వైయస్సార్ విగ్రహం వద్దకు చేరుకుని పూలమాలలతో ఘన నివాళులు అర్పించారు.