మానకొండూర్ ఎమ్మెల్యేను అడ్డుకున్న గ్రామస్థులు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం బాలయ్య పల్లిలో శుక్రవారం మద్య్హనం ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ చేసేందుకు వచ్చిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్య నారాయణను గ్రామస్థులు అడ్డుకున్నారు.పంచాయతీ భవనాన్ని బాలయ్య పల్లి, సాహెబ్ పల్లి గ్రామాల మధ్య ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. పోలీసులు అడ్డుకొని వారిని చెదరగొట్టారు.