పెద్ద కడబురు : ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే ఎరువుల విక్రయాలను జరపాలని సోమవారం పెద్ద కడబూరు వ్యవసాయాధికారిని సుచరిత అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కోసిగి సీఐ మంజునాథ్, పెద్ద కడబూరు ఎస్సై నిరంజన్ రెడ్డి తో కలసి పెద్ద కడబురులోని ఫర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేశారు. యూరియా స్టాక్, సేల్స్ వివరాలను చెక్ చేశారు. యూరియా కృత్రిమ కొరత సృష్టించినా, వ్యవసాయేతరులకు అమ్మినా, ఇతర రాష్ట్రాలకు తరలించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.