జిల్లాకు అన్నమయ్య పేరు పెట్టారు కానీ ఆయన జన్మించిన ప్రాంతాన్ని జిల్లా కేంద్రం చేయకుండా మార్చేశారని రాజంపేట జిల్లా కేంద్రం సాధన చేసి నాయకులు తరిగోపుల లక్ష్మీనారాయణ అన్నారు. రాజంపేట బైపాస్ లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద జేఏసీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజంపేటలో నీరు సమృద్ధిగా ఉన్న ప్రాంతం పరిశ్రమలు ఏర్పాటుకు అనువైన ప్రాంతమని తెలిపారు.