కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మోదీ గిఫ్ట్ పేరుతో మంగళవారం మద్య్హనం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా అర్చన అనే విద్యార్థిని సంతోషంతో భావోద్వేగానికి గురైంది. సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ నాకు ఓట్లేసింది ఓటర్లే కానీ నాకు ఓటేయించింది మాత్రం పిల్లలే అని తెలిపారు. ఓటేయించిన మీ కోసం ఏదైనా చేయాలనే ఉద్దేశంతోనే సైకిళ్లను పంపిణీ చేస్తున్నా అని అన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా నిర్మల్ లోని ఓ ఊరిలో ఒక పిల్లవాడు సైకిల్ లేక స్కూల్ వెళ్లకుండా ఇంట్లోనే ఉంటే అతనిని పిచ్చివాడిగా ముద్రవేశారు. ఆ పిల్లవాడిని క