చట్ట ప్రకారం జీఎస్టీ సజావుగా చెల్లించేలా ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు కర్నూలు కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో జీఎస్టీ అంశంపై సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి పన్ను చెల్లింపు దారులు సక్రమంగా జీఎస్టీ చెల్లించేలా కమర్షియల్ టాక్స్ డిపార్ట్మెంట్ కు సహకరించాలని అధికారులను ఆదేశించారు.. రిజిస్టర్ చేసుకోకుండా వ్యాపారాలు చేసేవారు, కాంట్రాక్టర్లను రిజిస్ట్రేషన్ చేయించి జిఎస్టి పన్ను చ