నందిగామలో వైసీపీ రైతు పోరు కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో మంగళవారం ఉదయం నందిగామలో జరుగుతున్న రైతు పోరు కార్యక్రమానికి తిరువూరు మాజీ ఎమ్మెల్యే స్వామి దాసు బయలుదేరి వెళుతున్న క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. 30 యాక్ట్ అమల్లో ఉన్న సందర్భంగా ఎటువంటి నిరసన కార్యక్రమాలు ఆందోళన చేపట్టకూడదని పోలీసులు స్వామీ దాస్ కి తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు కొన్ని వాహనాలను అడ్డుకున్నారు.