నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్లుగా గతంలో పనిచేసిన హరిత, వికాస్ మరమ్మతులు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి విమర్శించారు. ఇదే విషయాన్ని హైకోర్టుకు జిల్లా యంత్రాంగం నివేదిక అందించిందని స్పష్టం చేశారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు డిమాండ్ చేశారు.