తిరుపతి రేణిగుంట గాజుల మన్యం ఎస్సీ కాలనీ సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది తిరుపతి నుంచి పుత్తూరు వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి గాయపడిన వారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు అదృష్టవశాత్తు కారులోని ఎయిర్ బాగ్స్ ఓపెన్ అవ్వడం వల్ల పెను ప్రమాదం తప్పినట్లు అయిందని స్థానికులు తెలిపారు.