భూపాలపల్లి నియోజకవర్గంలోని చిట్యాల మండల కేంద్రంలో మంగళవారం ఉదయం 11 గంటలకు దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించినట్లు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి పేద ప్రజల అభ్యున్నతి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిన మహా గొప్ప వ్యక్తి అని,ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరు కొనసాగించాలని, ప్రజల్లో లేకపోవడం చాలా బాధాకరమని తెలిపారు ఎమ్మెల్యే గండ్ర.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.